ప్రయాణికులకు గుడ్ న్యూస్!.. త్వరలోనే టోల్ గేట్లు మాయం?

by Disha Web Desk 5 |
ప్రయాణికులకు గుడ్ న్యూస్!.. త్వరలోనే టోల్ గేట్లు మాయం?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోని టోల్ గేట్లను రద్దు చేస్తూ వాహాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై టోల్ గేట్ల వద్ద ఎక్కువ సేపు ఆగాల్సిన పని లేకుండా నూతన వ్యవస్థను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న టోల్ వ్యవస్థను మారుస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. త్వరలో అదునాతన టెక్నాలజీతో ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. దీనికోసం త్వరలో ఇప్పుడున్న టోల్ గేట్ వ్యవస్థ రద్దు పరిచనున్నారు. అనంతరం శాటిలైట్ బేస్‌డ్ టెక్నాలజీతో టోల్ సిస్టం అమల్లోకి వస్తుంది. దీంతో వాహన యజమానులు హైవేపై ప్రయాణించేటప్పుడు జీపీఎస్ ఆధారంగా డైరెక్టుగా వారి బ్యాంకు ఖాతా నుంచి టోల్ వసూలు కానుంది. ఈ కొత్త సౌకర్యంతో ప్రయాణికులు టోల్ గేట్ల వద్ద పడిగాపులు కాస్తు సమయం వృధా చేయాల్సిన పనిలేకుండా పోనుంది.


Next Story

Most Viewed