ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్: లవ్ బ్రేకప్స్‌కు సెలవులు.. ఆధారాలు చూపకుండా సెలవులు పొడగించుకోవచ్చు!

by Anjali |   ( Updated:2024-04-21 11:56:32.0  )
ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్: లవ్ బ్రేకప్స్‌కు సెలవులు.. ఆధారాలు చూపకుండా సెలవులు పొడగించుకోవచ్చు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో ప్రేమలో పడటం.. వెంటనే బ్రేకప్‌లు చెప్పుకోవడం కామన్ అయిపోయింది. అయితే.. ఈ బ్రేకప్‌లను కొందరు సీరియస్‌గా తీసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండగా.. మరికొందరు లైట్ తీసుకొని ముందుకు వెళుతున్నారు. ఈ లవ్‌లు, బ్రేకప్‌లపై సినిమాల ప్రభావం అతిగానే ఉంటోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బ్రేకప్ అయి తీవ్ర బాధలో ఉన్న వారికి ప్రముఖ ఐటీ శుభవార్త చెప్పింది. రిలేషన్‌షిప్ బ్రేకప్స్, వ్యక్తిగత సమస్యలతో బాధపడుతోన్న వారికి ఇకపై సెలవులు ఇవ్వాలని ఇండియాలోని ప్రముఖ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ ‘స్టాక్ గ్రో’ తమ ఉద్యోగులకు వినూత్న పాలసీని తీసుకొచ్చింది. ఇందుకోసం తమ సమస్యల గురించి ఎలాంటి ప్రశ్నలు అడగమని తెలిపింది. అంతేకాకుండా ఆధారాలు చూపాల్సిన అవసరం కూడా లేదని వెల్లడించింది. బ్రేకప్స్ సమస్యలతో బాధపడుతోన్న వారు అవసరాన్ని బట్టి సెలవును పొడిగించుకోవచ్చని తెలిపింది. కంపెనీ యాజమాన్యం ఈ గుడ్ న్యూస్ చెప్పగానే ప్రస్తుతం స్టాక్ గ్రో కంపెనీలో పని చేస్తోన్న 30 మిలియన్ల మంది యూజర్లు ఎగిరిగంతులేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed