- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Donald Trump: ఇలాంటి విజయాన్ని ఎన్నడూ చూడలేదు
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. దీంతో, తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. తన మద్దతుదారులు చప్పట్లతో అభినందనలు తెలుపుతుండగా భార్య మెలానియా (Melania Trump), చిన్న కుమారుడు బారన్‌తో కలిసి ట్రంప్ (Donald Trump) వేదిక పైకి వచ్చారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారురు. ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని ట్రంప్ అన్నారు. అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతుందని, ఈ ఎన్నికల సమరంలో రిపబ్లికన్లు పోరాడారని అన్నారు. ‘‘ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు నిర్వహించిన ప్రచారం అతిపెద్ద రాజకీయ ఉద్యమం. అమెరికా గతంలో ఎన్నడూ చూడని విక్టరీని మనం దక్కించుకున్నాం. ఈసందర్భంగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పట్నుంచి ప్రతిక్షణం మీ కోసం, మీ కుటుంబం కోసం పోరాటం చేస్తాను. మనల్ని విమర్శించేవారిని వారిని తప్పని నిరూపించారు. అసలు సాధ్యం కాదు అనుకున్న అడ్డంకులన్నీ అధిగమించాం. ఈ విజయం అందించేందుకు కష్టపడి పనిచేసిన వారికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రపంచంలోని యుద్ధాలను ఆపి, అమెరికాను గ్రేటెస్ట్‌గా మార్చడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాను. రాబోయే రోజుల్లో సరిహద్దుల సమస్యను పరిష్కరిస్తాం. ప్రజలు చట్టబద్ధంగా దేశంలోకి రావాలి’’ అని మాట్లాడారు. రిపబ్లికన్ పార్టీకి 315 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. పాపులర్ ఓట్లలోనూ రిపబ్లికన్ పార్టీదే హవా కొనసాగుతుందని తెలిపారు. ఈ రాజకీయ మార్పు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.
భార్యకు ధన్యవాదాలు తెలిపిన ట్రంప్
తన భార్య మెలానియాకు ట్రంప్ ధన్యవాదాలు చెప్పారు. ఆమె రాసిన పుస్తకం ప్రజాదరణ పొందిందని అన్నారు. అలాగే ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ (JD Vance) గొప్ప ఎంపిక అని ప్రశంసించారు.‘‘కాబోయే ఉపాధ్యక్షుడు వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్‌కు అభినందనలు’’ అని అన్నారు. తన సహాయకులు అందించిన సేవలను కొనియాడారు. అలాగే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) తో ఉన్న అనుబంధం గురించి ప్రస్తావించారు. ఇక, ట్రంప్ విజయాన్ని కొనియాడుతూ.. ఇది అమెరికా చరిత్రలో అతిపెద్ద రాజకీయ పునరాగమనం అని వాన్స్ (JD Vance) అభివర్ణించారు.