- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nitin Gadkari :టూవీలర్ కొనుగోలు దారులకు నితిన్ గడ్కరీ గుడ్ న్యూస్
దిశ, డైనమిక్ బ్యూరో : రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించని కారణంగా దేశవ్యాప్తంగా అనేకమంది ప్రాణాలు కోల్పోతుండటంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ద్విచక్ర వాహన తయారీ దారులు టూవీలర్స్ కొనుగోలుదారులకు డిస్కౌంట్‌లో హెల్మెట్ అందించాలని కోరారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సహేతుకమైన ధరలకు హెల్మెట్లు అందించే విషయంలో ఆలోచన చేయాలన్నారు. ఈ నిర్ణయం వాహనదారుల ప్రాణాలను కాపాడటంలో ఉపయోగపడుతుందన్నారు. 2022లో 30వేలమంది బైకర్స్ హెల్మెట్ ఉపయోగించని కారణంగా చనిపోయారని వెల్లడించారు. దేశంలోని ప్రతి తాలుకాలో డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభించాలన్నది తన ఆశయమని, అలాగే స్కూల్ బస్సులకు పార్కింగ్ ఏర్పాటుకు సంబంధించి ఒక ప్లాన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.