- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణం పోయినా దేశ విభజన జరగనివ్వను.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
by Javid Pasha |
X
కోల్‌కతా : కొందరు నాయకులు రాజకీయాల కోసం విద్వేషాలు రెచ్చగొడుతూ దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రంజాన్ సందర్భంగా శనివారం కోల్‌కతాలోని రెడ్ రోడ్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. ‘దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్దమే. ఎట్టిపరిస్థితుల్లోనూ దేశాన్ని విభజించడానికి అనుమతించబోము. బెంగాల్‌లో అల్లర్లను కాదు శాంతిని కోరుకుంటున్నాం’ అని అన్నారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉండాలని, రెచ్చగొట్టే ప్రసంగాలను నమ్మొద్దని కోరారు. ధైర్యం ఉంది కాబట్టే దర్యాప్తు సంస్థలతో పోరాడుతున్నామని తెలిపారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
Advertisement
Next Story