CBI: ఢిల్లీ విమానాశ్రయంలో రూ. 30 కోట్ల విలువైన డ్రగ్స్‌తో దొరికిన భారత సంతతి వ్యక్తి

by S Gopi |
CBI: ఢిల్లీ విమానాశ్రయంలో రూ. 30 కోట్ల విలువైన డ్రగ్స్‌తో దొరికిన భారత సంతతి వ్యక్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్‌ను రవాణా చేస్తున్న భారత సంతతి జర్మనీ వ్యక్తిని సీబీఐ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్‌పోల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా అతని వద్ద నుంచి అధికారులు ఆరు కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దోహా నుంచి ఢిల్లీ వచ్చిన అశోక్ కుమార్ తనతో పాటు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్టు అధికారులకు సమాచారం అందింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీబీఐ అధికారులు టెర్మినల్ 3 వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు బొమ్మల్లో 270 క్యాప్స్యూల్స్‌లో డ్రగ్స్‌ను నింపినట్టు గుర్తించారు. వాటి విలువ రూ. 30 కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.



Next Story