- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోర్న్ ఊబిలో బాలలు.. తిట్టడం కంటే సంస్కరించడమే బెటర్ : హైకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో : పోర్న్ వ్యసనం ఊబిలో పిల్లలు చిక్కుకుంటున్న వైనంపై మద్రాస్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలలో సులభంగా పోర్న్ ఫోటోలు, వీడియోలను చూసే అలవాటు టీనేజర్లలో పెరుగుతోందని న్యాయస్థానం గుర్తించింది. ఇటువంటి తరుణంలో టీనేజీ యువతకు మార్గనిర్దేశం చేయాలని సమాజానికి కోర్టు పిలుపునిచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ తరం పిల్లలు తీవ్ర సమస్యలతో సతమతం అవుతున్నారు. వారిని తిట్టడం, శిక్షించే బదులు సమాజం వారికి సరైన సలహాలు ఇవ్వాలి. వారు ఈ వ్యసనాన్ని వదిలించుకోవడానికి సరైన విద్యను అందించాలి. ఇది పాఠశాల దశ నుంచే ప్రారంభం కావాలి’’ అని కోర్టు కామెంట్ చేసింది. ‘‘పోర్న్ ముఖ్యంగా సెక్స్ దిశగా ప్రేరేపిస్తుంది.. దీనికి బానిస కావడం చాలా సులభం’’ అని తెలిపింది. యుక్త వయస్కులు అత్యధిక సంఖ్యలో అశ్లీల సమాచారానికి అడిక్ట్ అవుతున్నారంటూ ఇటీవల వెలువడిన పరిశోధనా నివేదికల్ని కోర్టు హైలైట్ చేసింది.