Gaza: గాజాలో మరో 14 మంది మృతి.. రఫా సిటీపై ఇజ్రాయెల్ వైమాణిక దాడి

by vinod kumar |
Gaza: గాజాలో మరో 14 మంది మృతి.. రఫా సిటీపై ఇజ్రాయెల్ వైమాణిక దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజా(Gaza)పై ఇజ్రాయెల్ (Israel) దాడులు ఆగడం లేదు. తాజాగా దక్షిణ రఫా నగరం దరాజ్ శివారులోని ఓ ఇంటిపై వైమాణిక దాడి చేసింది. ఈ ఘటనలో 14 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా.. ఒకే ఇంట్లో ఉన్న 10 మంది మరణించారు. అంతేగాక దాడి జరిగిన భవనం పూర్తిగా ధ్వంసమై సమీపంలోని ఇళ్లు దెబ్బతిన్నాయని వైద్యాధికారులు తెలిపారు. ఈజిప్ట్‌ (Egypt) సరిహద్దుకు సమీపంలో ఉన్న రఫాలో ఇజ్రాయెల్ ట్యాంకులు పశ్చిమ ప్రాంతం వైపు లోతుగా దూసుకెళ్లాయని వెల్లడించారు. యుద్ధ ట్యాంకుల నుంచి భారీగా మంటలు వ్యాపించడంతో అక్కడ ఆశ్రయం పొందుతున్న ప్రజలు ఖాన్ యూనిస్ (Khan Yunis) నగరం వైపు పారిపోయారని పలు కథనాలు పేర్కొన్నాయి. అంతేగాక బీట్ లాహియా పట్టణం(Beet laahiya) లో జరిగిన మరో రెండు వేర్వేరు వైమాణిక దాడుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడులపై ఇజ్రాయెల్ స్పందించలేదు. కాగా, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో 45000 మంది మరణించారు.

Advertisement

Next Story

Most Viewed