- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రూ.500 లకే గ్యాస్ సిలిండర్.. మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్!
దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అయితే ఇటీవల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించి సామాన్య ప్రజలకు కాస్త ఊరటనిచ్చారు. తాజాగా, రాజస్థాన్ ప్రభుత్వం కోట్ల మందికి మంచి చేసే ఆలోచనతో ఆ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపింది. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ప్రజల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
రాజస్థాన్‌లో (BPL) కింద ఉన్న వారికి ఉజ్వల స్కీమ్‌ను పొందగలరని ప్రకటన చేసింది. వారికి గ్యాస్ సిలిండర్ కేవలం రూ.500లకే లభిస్తుంది. ఈ పథకాన్ని రాజస్థాన్ (కాంగ్రెస్ పార్టీ) ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రారంభించారు. దీని కోసం రూ.750 కోట్లు కేటాయించినట్లు సమాచారం. దీని వల్ల 75 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కల్పిస్తుంది. ఈ పథకం అమలు సాధ్యం కాదని విపక్షాలు విమర్శించాయి. కానీ, ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసి నెలకు రూ. 500 గ్యాస్ సిలిండర్‌ను అందిస్తోంది. ఇది తెలిసిన వారు మిగతా రాష్ట్రాలు కూడా ఈ దిశగా ఆలోచిస్తే ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నారు.