తొలి త్రైమాసికంలో 75 శాతం క్షీణించిన స్టార్టప్‌ల నిధుల సేకరణ!

by srinivas |   ( Updated:2023-04-14 13:56:06.0  )
తొలి త్రైమాసికంలో 75 శాతం క్షీణించిన స్టార్టప్‌ల నిధుల సేకరణ!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారతీయ స్టార్టప్‌ల నిధుల సేకరణ ఏకంగా 75 శాతం క్షీణించాయి. 2022లో ఇదే కాలంలో 11.9 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 97.28 వేల కోట్ల) విలువైన పెట్టుబడులను సాధించగా, ఈ ఏడాది జనవరి-మార్చిలో స్టార్టప్‌లు కేవలం 2.8 బిలియన్ డాలర్ల(రూ. 23 వేల కోట్ల) నిధులను సేకరించాయి. సమీక్షించిన కాలంలో అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెరుగుదల వంటి అంశాలు పెట్టుబడులను గణనీయంగా ప్రభావితం చేశాయని ప్రముఖ గ్లోబల్ మార్కెట్ ఇంటిలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ట్రాక్షన్ నివేదిక శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది.

అలాగే, 2022 మొదటి త్రైమాసికంలో కొత్తగా 14 యూనికార్న్ కంపెనీలు పుట్టుకురాగా, ఈ ఏడాది జనవరి-మార్చిలో కొత్త యూనికార్న్‌లు ఏవీ రాలేదు. త్రైమాసిక పరంగా క్షీణత ఉన్నప్పటికీ ఏడాది ఫిబ్రవరిలో భారత స్టార్టప్‌లు 777 మిలియన్ డాలర్ల(రూ. 6,350 కోట్ల) నిధులు సేకరించాయి. ఆ తర్వాత మార్చిలో ఏకంగా 54 శాతం ఎక్కువగా రూ. 9,808 కోట్ల పెట్టుబడులను రాబట్టడం గమనార్హం. ట్రాక్షన్ నివేదిక ప్రకారం, సమీక్షించిన త్రైమాసికంలో ఫిన్‌టెక్, రిటైల్, ఎంటర్‌ప్రైజ్ రంగాలు అత్యధికంగా నిధులను సేకరించాయి. ఫిన్‌టెక్ రంగం అంతకుముందు త్రైమాసికం కంటే 150 శాతం ఎక్కువ పెట్టుబడులు సాధించిందని నివేదిక పేర్కొంది.

Also Read..

తొమ్మిది నెలల గరిష్ఠానికి భారత ఫారెక్స్ నిల్వలు!

Advertisement

Next Story