ఏప్రిల్ 1 నుంచి ఈ మందుల ధరలు ప్రియం

by Hajipasha |
ఏప్రిల్ 1 నుంచి ఈ మందుల ధరలు ప్రియం
X

దిశ, నేషనల్ బ్యూరో : పెయిన్‌ కిల్లర్లు, యాంటి బయోటిక్స్‌, యాంటీ ఇన్ఫెక్టివ్స్‌ సహా పలు అత్యవసర ఔషధాల ధరలు ఈరోజు (ఏప్రిల్‌ 1) నుంచి పెరగనున్నాయి. ఈ లిస్టులో దాదాపు 923 రకాల ఫార్ములాలతో కూడిన అత్యవసర ఔషధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ధరలు అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 0.0055 శాతం మేర పెరుగుతాయని జాతీయ ఔషధాల ధరల సంస్థ(ఎన్​పీపీఏ) వెల్లడించింది. ఈ మేరకు ఎన్​పీపీఏ జారీ చేసిన నోటిఫికేషన్​లో మందుల ‘టోకు ధరల సూచీ’(WPI)లో వార్షిక మార్పును ప్రకటించింది.పెయిన్‌కిల్లర్ డైక్లోఫెనాక్ (Diclofenac) ఒక్కో టాబ్లెట్ ధర రూ. 2.05కి చేరింది. ఇబుప్రోఫెన్ (Ibuprofen) టాబ్లెట్‌ల ధర రూ.71(200 Mg)కి, రూ.1.20 (400 Mg)కి పెరిగింది. WPIలో సూచించిన ధరలకు అనుగుణంగా షెడ్యూల్​ చేసిన ఫార్ములాల మందులపై ఎమ్మార్పీ రేటును కూడా పెంచొచ్చు. ఈవిధంగా ధరలు పెరిగిన లిస్టులో యాంటీ బయోటిక్స్, యాంటీ మలేరియల్స్, టైప్ 2 డయాబెటిస్‌కు రోగులు వాడే మందులు కూడా ఉన్నాయని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed