- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Delhi : తుపాకులు, కత్తులతో నలుగురు టీనేజర్ల ఎటాక్.. ఏమైందంటే..?
దిశ, నేషనల్ బ్యూరో : 16, 17 ఏళ్ల నలుగురు టీనేజర్లు తుపాకులు, కత్తులతో దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లోని కిషన్‌ఘర్ ఏరియాలో చెలరేగారు. మరో ఇద్దరు టీనేజర్ల(Minors)పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 16 ఏళ్ల బాలుడు చనిపోగా, 18 ఏళ్ల సౌరభ్ యాదవ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. శనివారం సాయంత్రం 5.45 గంటలకు కిషన్‌ఘర్ ఏరియాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చాయి.
ఇద్దరు బాధిత టీనేజర్లతో సంజయ్ మెహ్లావత్ (38) అనే యువకుడికి గొడవ జరిగినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. సంజయ్ మెహ్లావత్ సూచనల మేరకే నలుగురు టీనేజర్లు కత్తులు, తుపాకులు తీసుకొని ఈ దాడి చేశారని వెల్లడైంది. దీంతో సూత్రధారి సంజయ్ మెహ్లావత్‌తో దాడికి పాల్పడిన నలుగురు బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఒక బుల్లెట్ సహా పలు సాక్ష్యాలను సేకరించారు.