- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రష్యాలో ఘోర విషాదం.. నలుగురు భారత వైద్య విద్యార్థులు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: రష్యాలో ఘోర విషాదం జరిగింది. నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు నదిలో గల్లంతయ్యారు. వెలిక్ నోవ్గోరోడ్ లోని యూనివర్సిటీలో చదువుతున్న మహారాష్ట్రకు చెందిన నలుగురు స్టూడెంట్స్ విహారయాత్రకు వెళ్లి నదిలో మునిగి చనిపోయారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ఐదుగురు విద్యార్థులు వోల్ఖోవ్ నది వెంబడి వాకింగ్ కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానిక ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇప్పటి వరకు ఒక డెడ్ బాడీని వెలికితీసింది. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలిస్తోంది.
మహారాష్ట్ర వాసులే
ఈ ప్రమాదంలో చనిపోయిన నలుగురు విద్యార్థులు మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందిన వారని విదేశాంగ శాఖ తెలిపింది. ప్రాణాలతో బయటపడిన మరో విద్యార్థిది కూడా అదే ప్రాంతమని వివరించింది. మృతులు హర్షల్ అనంతరావు దేసాలే, జిషాన్ అష్పక్ పింజారీ, జియా ఫిరోజ్ పింజారీ, మాలిక్ గులాంగౌస్ మహ్మద్ యాకూబ్ గా గుర్తించారు. ప్రాణాలతో బయటపడిన స్టూడెంట్ నిషా భూపేశ్ సోనావానే. వీరంతా 18 నుంచి 20 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన విద్యార్థిని నిషా కు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కుటుంబసభ్యులు చూస్తుండగానే..
వోల్ఖావ్ నది వెంబడి వాకింగ్ కు వచ్చిన విద్యార్థులకు నదిలో కాసేపు ఈత కొట్టాలనుకున్నారు. ఆ టైంలో విద్యార్థుల్లో ఒకరైన జిషాన్ పింజరి తన పేరెంట్స్ తో వీడియో కాల్ లో ఉన్నారు. వోల్ఖోవ్ నదిలోకి దిగగానే జిషాన్ తన కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేశాడు. అతని తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు జిషాన్ ను, అతడి స్నేహితులను నదిలో నుంచి బయటకు రావాలని కోరారు వారు అలా చెప్తూ ఉండగానే.. పెద్ద అల ఒక్కసారిగా రావడంతో నీటి ఉద్ధృతికి వారందరూ కొట్టకుపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తాము చూస్తుండగానే, జిషాన్ తో పాటు మరో ముగ్గురు నీటిలో మునిగిపోయారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
డెడ్ బాడీలను భారత్ తెప్పించే ప్రయత్నం
విద్యార్థుల మృతదేహలను భారత్ కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. డెడ్ బాడీలను భారత్ తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఈ యాక్సిడెంట్ దురదృష్ట ఘటన అని పీటర్స్ బర్గ్ లోని భారత దౌత్యకార్యాలయం పేర్కొంది. బాధిత కుటుంబాలకు సాయం అందిస్తామని వెల్లడించింది.