‘నీట్’ నిందితులకు నాలుగు రోజుల కస్టడీ..గోద్రా కోర్టు నిర్ణయం

by Vinod |
‘నీట్’ నిందితులకు నాలుగు రోజుల కస్టడీ..గోద్రా కోర్టు నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో నలుగురు నిందితులకు గుజరాత్ లోని గోద్రా న్యాయస్థానం నాలుగు రోజుల సీబీఐ కస్టడీ విధించింది. గోద్రాలో జరిగిన నీట్ యూజీ పరీక్షలో అవకతవకలకు పాల్పడిన ఐదుగురిని ఈ నెల 5వ తేదీన గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వారికి కస్టడీ విధించాలని సీబీఐ కోరగా కోర్టు అందుకు అంగీకరించింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం, ఆధారాలు సేకరించేందుకు నిందితులను సీబీఐ విచారించనుంది.మరో నిందితుడు రాయ్‌ను ఇప్పటికే 14 రోజుల పోలీసు కస్టడీని పూర్తి చేసినందున ఆయనకు సీబీఐ రిమాండ్ కోరలేదు. గుజరాత్ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేసినప్పటికీ సీబీఊ మరింత సమాచారాన్ని రాబట్టనున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోంది: ధర్మేంద్ర ప్రధాన్

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) విషయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. ‘నీట్ వివాదంపై కాంగ్రెస్ చర్చను కోరుకోవడం లేదు. చర్చ నుంచి పారిపోవాలనుకుంటోంది. సభలో గందరగోళం సృష్టించడం మాత్రమే వారి ఉద్దేశం’ అని మండిపడ్డారు. అయితే విద్యార్థుల ప్రయోజనాలకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ లేవనెత్తిన నీట్ పరీక్ష అంశంపై రాష్ట్రపతి పార్లమెంటులో ప్రసంగించారని గుర్తు చేశారు.

Next Story

Most Viewed