J&K: కిష్త్‌వాడ్‌లో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో నలుగురు జవాన్లకు గాయాలు

by S Gopi |
J&K: కిష్త్‌వాడ్‌లో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో నలుగురు జవాన్లకు గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని కిష్త్‌వాడ్‌లో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయనే సమాచారం అందుకున్న తర్వాత జమ్మూకశ్మీర్ పోలీసులు కిష్త్‌వాడ్‌ను భద్రతా బలగాలు చుట్టుముట్టాయయని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్న ప్రదేశాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య కాల్పులు జరగ్గా, నలుగు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన సిబ్బందిలో ఒకరిని చికిత్స కోసం సమీపంలోని కమాండ్ ఆసుపత్రికి తరలించగా, మిగిలిన ముగ్గురు స్థానికంగా చికిత్స పొందుతున్నారు. కఠువాలో సైతం శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ హతమార్చింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర పాలిత ప్రాంతంలో చెదురుమదురు హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. అంతకుముందు బుధవారం జమ్మూకశ్మీర్‌లోని కఠువా-ఉదంపూర్ సరిహద్దు సమీపంలోని బసంత్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉధంపూర్ జిల్లాలో అంతకుముందు రోజు భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న పారామిలటరీ దళాలు, పోలీసు సిబ్బంది బసంత్‌గఢ్‌కు చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాకిస్తాన్ రేంజర్లు అకారణంగా కాల్పులు జరపడంతో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) సిబ్బంది గాయపడిన కొద్ది గంటల తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

Advertisement

Next Story

Most Viewed