- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking News : కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై కాల్పులు

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే(Congress Ex MLA)పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు(Firing) జరిపారు. ఈ సంఘటనలో ఆయన తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లోని బిలాస్‌పూర్(Bilaspur) జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బాంబర్ ఠాకూర్(Bomber Thakur) తన నివాసంలో ఉండగా.. నలుగురు దుండగులు ఆయన నివాసంలోకి చొరబడి ఆయనతోపాటు వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై 12 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో ఆయనకు బుల్లెట్ గాయాలు కాగా సిమ్లాలోని ఐజీఎంసీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్‌వీందర్ సింగ్ సుఖు(CM Sukhvinder Singh Sukhu) ఈ కాల్పుల సంఘటనపై స్పందించారు.
గాయపడిన మాజీ ఎమ్మెల్యే బాంబర్ ఠాకూర్‌తో మాట్లాడినట్లు చెప్పారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. అలాగే కాల్పులు జరిపిన నిందితులను అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. కాగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ నేత ఠాకూర్ అధికార నివాస ప్రాంగణంలోని సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
READ MORE ....
High Court: భార్య వల్గర్ చాట్ చేయడాన్ని ఏ భర్త సహించడు- విడాకులు మంజూరు చేసిన హైకోర్టు