మానవ సంబంధాల్లో చిచ్చు పెడుతున్న 'ది కేరళ స్టోరీ'..

by Vinod kumar |   ( Updated:2023-05-23 14:07:09.0  )
మానవ సంబంధాల్లో చిచ్చు పెడుతున్న ది కేరళ స్టోరీ..
X

న్యూఢిల్లీ: 'ది కేరళ స్టోరీ' సినిమా మానవ సంబంధాల్లో చిచ్చు పెడుతోంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో జరిగిన ఘటనల్లో మహిళలను పురుషులు వేధింపులకు గురి చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రేమికులు ది కేరళ స్టోరీ సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత ఆమెను మతం మారమని అతను ఒత్తిడి చేశాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. ఖజ్రానా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కథనం ప్రకారం.. వీళ్లిద్దరు ఇటీవలే సినిమాకు వెళ్లారు. సినిమా చూసిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అతను ఆమెను దుర్భాషలాడి వెళ్లిపోయాడు. ఆమె మే 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ సినిమాలో లవ్ జీహాద్ సిద్ధాంతం కూడా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో లవ్ జీహాద్ సంఘటన జరిగింది.

ఈ ఘటనలో ఓ మహిళ మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఓప్ఇండియా వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. ఓ అపార్ట్‌మెంట్‌లో భర్త అద్దెకు తీసుకున్న ఇంట్లో ఆ మహిళ ఉంటోంది. ఆ భర్త ఆమెను రేప్ చేశాడని.. తన స్నేహితులను తీసుకొచ్చి ఆమెపై అత్యాచారానికి పురికొల్పాడని ఆ నివేదిక పేర్కొంది. ఆ వ్యక్తి తన భార్యను కొట్టడం, హింసించడం వంటివి చేసేవాడని తెలిపింది. ఆ అపార్ట్‌మెంట్ యజమాని హిందూ జాగ్రన్ మంచ్ సభ్యులకు తెలుపగా.. వాళ్లు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి ఆమెను రక్షించారు. ఇక మూడో ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగింది. మైనారిటీ వర్గానికి చెందిన ఓ వ్యక్తి హిందూ సర్‌నేమ్‌తో తన గుర్తింపును దాచిపెట్టాడు. ఒకమ్మాయి అతనితో లవ్‌లో పడింది. వారిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. అయితే పెళ్లి మాట ఎత్తే సరికి అతను తన కులాన్ని తెరపైకి తెచ్చాడు. అంతేకాదు ఆమెను కులం మార్చుకోమని హింసించాడని.. వేధించాడని ఓప్‌ఇండియా పేర్కొంది. మొత్తానికి ఈ వివాదాస్పద కేరళ స్టోరీ సినిమా ఇంకెతమంది జీవితాలను నాశనం చేస్తుందో.

Advertisement

Next Story