వరుసగా పాఠ్యాంశాలను తొలగిస్తున్న NCERT

by Harish |
వరుసగా పాఠ్యాంశాలను తొలగిస్తున్న NCERT
X

న్యూఢిల్లీ: నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) పదోతరగతి పాఠ్యపుస్తకాల్లో కీలక మార్పులు జరిగాయి. ఆ పుస్తకాల నుంచి పలు చాప్టర్లను తొలగించారు. సిలబస్‌ హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా పదో తరగతి పాఠ్యపుస్తకాల నుంచి పలు అధ్యాయాలను పూర్తిగా తీసేశారు. కొత్తగా విడుదల చేసిన పాఠ్యపుస్తకాల్లో పీరియాడిక్‌ టేబుల్‌ (ఆవర్తన పట్టిక), ప్రజాస్వామ్యం, శక్తి వనరులు వంటి పాఠాలు లేవు.

సైన్స్‌ పాఠ్యపుస్తకం నుంచి చాప్టర్‌ 5: పీరియాడిక్‌ టేబుల్‌, చాప్టర్‌ 14: శక్తి వనరులు, చాప్టర్‌ 16: పర్యావరణ సుస్థిరత వంటి అభ్యాసాలను తొలగించారు. పదో తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పాఠ్య పుస్తకంలోని చాప్టర్‌ 5: ప్రముఖ ప్రజా పోరాటాలు, ఉద్యమాలు, చాప్టర్‌ 6: రాజకీయ పార్టీలు, చాప్టర్‌ 8: ప్రజాస్వామ్యానికి సవాళ్లు అనే పాఠ్యాంశాలను పూర్తిగా తొలగించారు.

కరోనా టైంలో విద్యార్థులపై సిలబస్‌ భారాన్ని తగ్గించడం అత్యవసరమని ఎన్‌సీఈఆర్‌టీ వాదించింది. కష్టమైన సబ్జెక్టు, అతిగా వ్యాప్తి చెందుతున్న సమాచారం, అసంబద్ధమైన సమాచారం పేరుతో ఆయా పాఠ్యాంశాలను తొలగిస్తున్నట్లు పేర్కొంది. గత నెలలో 9వ తరగతి, 10వ తరగతి సైన్స్‌ పాఠ్యపుస్తకాల నుంచి చార్లెస్‌ డార్విన్‌ పరిణామ సిద్ధాంతాన్ని ఎన్‌సీఈఆర్‌టీ తొలగించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed