Flood ravaged: గుజరాత్‌లో మరిన్ని భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

by vinod kumar |
Flood ravaged: గుజరాత్‌లో మరిన్ని  భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతమైన గుజరాత్‌లో సెప్టెంబర్ 2 నుంచి 4 మధ్య మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ముఖ్యంగా వడోదరలో అధిక వర్షాలు పడే చాన్స్ ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో వడోదరకు ఎల్లో అలర్ట్, సమీప జిల్లాలైన భరూచ్, నర్మదలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే సౌరాష్ట్రలోని అహ్మదాబాద్‌తో సహా దక్షిణ, మధ్య గుజరాత్‌కు దగ్గరగా ఉన్న నాలుగు జిల్లాలు ఈ నెల 4వరకు ఎల్లో అలర్ట్‌లోనే కొనసాగుతాయని పేర్కొంది. మరో 12 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వరదల కారణంగా రాష్ట్రంలో 28 మంది మరణించగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించింది. రోడ్లకు మరమ్మతులు చేపట్టడంతో పాటు విద్యుత్ పునరుద్దరిస్తున్నారు. అజ్వా డ్యాం నుంచి విశ్వామిత్ర నదిలోకి నీటిని విడుదల చేయడంతో పలు ప్రాంతాల్లో ఆరు నుంచి ఎనిమిది అడుగుల వరకు నీటి మట్టాలు పెరిగాయి.

Advertisement

Next Story