Fishermens Arrest: 22 మంది తమిళ మత్స్యకారుల అరెస్ట్.. అదుపులోకి తీసుకున్న శ్రీలంక నేవీ

by vinod kumar |
Fishermens Arrest: 22 మంది తమిళ మత్స్యకారుల అరెస్ట్.. అదుపులోకి తీసుకున్న శ్రీలంక నేవీ
X

దిశ, నేషనల్ బ్యూరో: సముద్ర సరిహద్దు దాటినందుకు గాను 22 మంది భారత మత్య్సకారులను శ్రీలంక నేవీ తాజాగా అరెస్ట్ చేసింది. భారత్, శ్రీలంక మధ్య లోతైన సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను అరెస్టు చేశారని, వారి నుంచి రెండు మెకనైజ్డ్ పడవలను శ్రీలంక నావికాదళం స్వాధీనం చేసుకున్నట్టు తరువైకులం మత్స్యకారుల సంఘం తెలిపింది. ఒక బ్యాచ్‌లో 12, మరో బ్యాచ్‌కు చెందిన 10 మందిని అరెస్టు చేసినట్టు పేర్కొంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ లో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

ఈ ఘటనలపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. శ్రీలంక నేవీ నుంచి తమిళ మత్య్స కారులు ఎదుర్కొంటున్న నిరంతర దాడులపై చర్చించడానికి ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో సమావేశమయ్యారు. మత్స్యకారుల సంఘం ప్రతినిధులను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై చర్చించారు. సమావేశానంతరం జైశంకర్ మాట్లాడుతూ..సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది రాజకీయ సమస్య కాకూదడని, మత్య్స కారుల జీవనోపాధికి సంబంధించిన అంశమని తెలిపారు. మత్స్యకారుల సంఘం, సంయుక్త కార్యవర్గంతో త్వరలోనే భేటీ అవుతామని చెప్పారు.

కాగా, గత వారం శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన 21 మంది మత్స్యకారులను భారతదేశానికి తిరిగి పంపించారు. కొలంబోలోని భారత హైకమిషన్ జాఫ్నాలోని భారత కాన్సులేట్, శ్రీలంక అధికారుల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మరో 22 మందిని శ్రీలంక నేవీ అరెస్టు చేయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed