- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూన్ 15 నుంచి పార్లమెంటు సమావేశాలు..!
దిశ, నేషనల్ బ్యూరో: ముచ్చటగా మూడో సారి ప్రధానిగా మోడీ ప్రమాణం చేయనున్నారు. ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. అయితే, ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు ఎప్పుడనేది ఆసక్తిగా మారింది. కాగా.. జూన్ మూడోవారంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జూన్ 15న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై.. జూన్ 22న సెషన్ ముగిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాష్ట్రపతి ప్రసంగం ఎప్పుడంటే
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన రెండ్రోజులపాటు ప్రమాణస్వీకారాలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత కొత్త స్పీకర్ ను ఎంపిక చేస్తారని సమాచారం. ఆ తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. అనంతరం, అధికారికంగా సమావేశాలను ప్రారంభించనున్నారు. ఇకపోతే, పార్లమెంటు సమావేశాల తేదీలపై కేబినేట్ ఏర్పడ్డాకే స్పష్టత రానుంది. ఆదివారం రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకారం ముగిసిన వెంటనే కేబినెట్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. కాగా.. కేంద్ర మంత్రివర్గం సలహా మేరకు 17వ లోక్‌సభను జూన్ 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రద్దు చేశారు.