BJP candidates list: యూ టర్న్.. బీజేపీ జమ్ముకశ్మీర్ అభ్యర్థుల జాబితా విత్ డ్రా

by Prasad Jukanti |
BJP candidates list: యూ టర్న్.. బీజేపీ జమ్ముకశ్మీర్ అభ్యర్థుల జాబితా విత్ డ్రా
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇటీవల కాలంలో పలు అంశాలపై యూ టర్న్ లు తీసుకుంటుందనే విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ ఆ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించిన అభ్యర్థుల జాబితాను విత్ డ్రా చేసుకుంది. త్వరలో జరగబోయే జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం సోమవారం ఉదయం 44 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఏం జరిగిందో ఏమో కానీ అనూహ్యంగా మధ్యాహ్నం సమయానికి ఆ జాబితాను ఉపసంహరించుకుంటున్నట్లు బీజేపీ అనౌన్స్ చేసింది. ఈ జాబితాలోని పేర్లను సవరించి మరో లిస్టును విడుదల చేస్తామని ప్రకటించింది. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే జమ్మూ కశ్మీర్ లో కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య సీట్ల ఒప్పందం కుదరడంతో బీజేపీ ఏదైనా పొత్తులకు ప్రయత్నిస్తున్నదా లేకా మరేదైనా వ్యూహం ఉందా అనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నది.

Advertisement

Next Story