బీజేపీ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం (వీడియో)

by Ramesh N |   ( Updated:2024-05-16 12:47:15.0  )
బీజేపీ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ ఆఫీస్‌లో గురవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని పండిట్ పంత్ మార్గ్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంటలు చెలరేగాయి. ఆఫీస్ లోని ఓ భాగంలో దట్టమైన పొగలు బయటకు వస్తున్నాయి. వెంటనే సమాచారం అందుకున్న మూడు ఫై ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

ఈ క్రమంలోనే నల్లటి పొగలు కమ్ముకుంటున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story