- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూపీలో మరో రైలు ప్రమాదం.. వైశాలి ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో మరో రైలు ప్రమాదం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 2.40 గంటలకు జిల్లాలోని ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఢిల్లీ నుంచి సహరసా వెళ్తున్న వైశాలి ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రైలులోని ఎస్-6 బోగీ పూర్తిగా దగ్ధమయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారని, వారిని దవాఖానకు తరలించామని జిల్లా ఎస్పీ సంజయ్ కుమార్ వెల్లడించారు.
కాగా, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. కాగా, ఈటావా జిల్లాలో పది గంటల వ్యవధిలో ఇది రెండో రైలు ప్రమాదం. బుధవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీ-దర్భంగా స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగడంతో మూడు కోచ్‌లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.