- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేదార్‌నాథ్‌లో కుక్క భక్తి.. కేసు పెట్టిన ఆలయ కమిటీ!
దిశ, వెబ్‌డెస్క్ః భారతీయులు కొలిచే ముక్కోటి దేవతల్లో భైరవుడు, అంటే కుక్క, ఉందో లేదో చాలా మందికి తెలియకపోవచ్చేమో గాని, భైరవుణ్ని దైవరూపంగా కొలుస్తారని మాత్రం చాలా మందికి తెలుసు. అయితే, ఆ భైరవుణ్ని మాత్రం దేవాలయంలోకి రాకూడదని, వచ్చినా దైవాన్ని ముట్టుకోకూడదని తాజాగా ఇదే భారతదేశంలో ఓ కేసు నమోదయ్యింది. అందులోనూ, శివుడికి ప్రతిరూపంగా కొలిచే భైరవుణ్ని, శివశైలమైన కేదార్‌నాథ్ దేవాలయంలోనే నిషేధించడం గమనార్హం. కుక్కను తీసుకొచ్చి సదరు 'పాపానికి' ఒడిగట్టింది ఇండియాకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన రోహన్ త్యాగి అనే వ్యక్తి. ఎంతో ప్రేమగా చూసుకునే తన పెంపుడు కుక్క నవాబ్ త్యాగిని తనతో పాటు కేదార్‌నాథ్ ఆలయానికి తీసుకెళ్లడమే నోయిడాకు చెందిన త్యాగి చేసిన తప్పు.
అయితే, ఈ కేసుకు సంబంధించి, సోషల్ మీడియాలో చాలా మంది నవాబ్ త్యాగి, అతని పెంపుడు-పేరెంట్స్ రోహన్ త్యాగికి మద్దతుగా నిలిచారు. మరికొందరు, భైరవుణ్ని శివుడి దగ్గరకు తీసుకొళ్లిన ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని అంటున్నారు. నాలుగున్నరేళ్ల హస్కీ, నవాబ్ కొన్ని రోజుల క్రితం తన యజమానులతో 'చార్ ధామ్ యాత్ర'లో పాల్గొంది. ఈ సందర్భంగా రోహన్, నవాబ్‌లు ఇద్దరూ శివుని ఎద్దు నంది నుండి ఆశీర్వాదం పొందుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, నవాబ్ తన పాదాలతో విగ్రహం పాదాలను తాకింది. ఇలా చేసినందుకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) 'నవాబ్ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించారు. నవాబు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ కూడా డిమాండ్ చేసింది. కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ ఆదేశాల మేరకు కమిటీ సీఈవో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.