ఆర్థిక సహకారమే ఉగ్రవాదానికి జీవనాధారం : Ajit Doval

by Vinod kumar |   ( Updated:2022-12-06 13:00:41.0  )
ఆర్థిక సహకారమే ఉగ్రవాదానికి జీవనాధారం : Ajit Doval
X

న్యూఢిల్లీ: భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సహాకారమే ఉగ్రవాదానికి జీవనాధారమని అన్నారు. టెర్రర్ ఫైనాన్సింగ్, రాడికలైజేషన్, సీమాంతర ఉగ్రవాదం కోసం టెర్రరిస్ట్ ప్రాక్సీలను ఉపయోగించడం వంటి సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు సురక్షితమైన స్వర్గధామంగా మారకూడదని నొక్కి చెప్పారు. మధ్య ఆసియా దేశాల భద్రతా సలహదారులతో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారం, ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిన అవసరాన్ని కూడా దోవల్ నొక్కిచెప్పారు.

ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని కోరారు. మధ్య ఆసియా దేశాలతో అనుసంధానమై ఉండటానికే తమ ముఖ్య ప్రాధాన్యమని చెప్పారు. తీవ్రవాద ప్రచారం, నియామకాలు, నిధుల సేకరణ ప్రయత్నాల విస్తరణ ఈ ప్రాంతానికి తీవ్రమైన భద్రతాపరమైన చిక్కుల పరిష్కారానికి ప్రతిస్పందన అవసరమని అధికారులు అంగీకరించారని ఒక ఉమ్మడి ప్రకటన పేర్కొంది. సీమాంతర ఉగ్రవాదం గురించి ప్రస్తావించడం భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న వివిధ ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ మద్దతునిచ్చే సూచనగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో ఖజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed