- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. ఆర్థికశాఖ నివేదికలో కీలకాంశాలు
దిశ, నేషనల్ బ్యూరో : మనదేశ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధిని సాధించి 2030 నాటికి రూ.5.83 కోట్ల కోట్ల(7 ట్రిలియన్ డాలర్ల)కు చేరుతుందని తాజాగా వెలువడిన కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక అంచనా వేసింది. 1 ట్రిలియన్ డాలర్లు అంటే రూ.83 లక్షల కోట్లకు సమానం. రాబోయే సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ వార్షిక వృద్ధిరేటు 7 శాతాన్ని దాటుతుందని పేర్కొంది. గురువారం రోజు(ఫిబ్రవరి 1న) పార్లమెంట్‌లో 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈనేపథ్యంలో సోమవారం రోజు ‘భారత ఆర్థిక వ్యవస్థ - ఒక సమీక్ష’ పేరుతో నివేదికను కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసింది. వచ్చే మూడేళ్లలో దేశపు జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) 5 ట్రిలియన్ డాలర్లకు చేరి, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఈ నివేదిక తెలిపింది. అయితే 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర సర్కారు ముందుకుపోతోంది. ఇక ఆర్థిక సర్వే రిపోర్టు సార్వత్రిక ఎన్నికల తర్వాత పూర్తి బడ్జెట్‌కు ముందు వెలువడుతుందని ఆర్థిక శాఖలోని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు.