Hospitality Sector : పర్యాటకాన్ని పట్టించుకున్నారు.. ‘ఆతిథ్యాన్ని’ విస్మరించారు

by Hajipasha |   ( Updated:2024-07-23 17:55:35.0  )
Hospitality Sector : పర్యాటకాన్ని పట్టించుకున్నారు.. ‘ఆతిథ్యాన్ని’ విస్మరించారు
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యాటక రంగంతో పాటు ఆధ్యాత్మిక టూరిజంకు పెద్దపీట వేశారు. అయితే దీనిపై ఆతిథ్య, పర్యాటక రంగాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ‘‘మౌలిక సదుపాయాలను డెవలప్ చేస్తే రోడ్లు డెవలప్ అవుతాయి. వాటి ద్వారా టూరిజం ప్రదేశాలకు సాఫీగా కనెక్టివిటీ ఏర్పడుతుంది. అయితే ప్రభుత్వం ఆతిథ్యరంగాన్ని విస్మరించింది’’ అని ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌హెచ్ఆర్ఏఐ) అధ్యక్షుడు ప్రదీప్ శెట్టి అని పేర్కొన్నారు. ఆతిథ్య రంగానికి సంబంధించిన జీఎస్టీని హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందన్నారు.

తమ రంగానికి మౌలిక సదుపాయాల హోదాను మంజూరు చేయాలనే డిమాండ్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ‘‘రోడ్లను డెవలప్ చేయడంపై కేంద్రం ఫోకస్‌ను పెంచడం పర్యాటక రంగంలో పనిచేస్తున్న రవాణా సంస్థలకు ప్లస్ పాయింట్. మాలాంటి వ్యాపారాలకు ఈ నిర్ణయం సానుకూలంగా పరిణమిస్తుంది’’ అని మేక్ మైట్రిప్ సంస్థ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో రాజేష్ మాగో తెలిపారు. ‘‘మాలాంటి ఈ-కామర్స్ టూరిస్ట్ ఆపరేటర్లపై టీడీఎస్ రేటును 0.1 శాతానికి తగ్గించడం సంతోషకర అంశం’’ అని ఆయన చెప్పారు.

Advertisement

Next Story