- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UP: రూ.500 దొంగిలించాడనే అనుమానంతో పదేళ్ల కొడుకును కొట్టి చంపిన తండ్రి
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బులు దొంగలించాడనే అనుమానంతో కన్న కొడుకును తండ్రి కట్టెల పొయ్యి ఊదే గొట్టపు పైపుతో కొట్టి చంపాడు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే, రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో తయోడి గ్రామంలో పదేళ్ల బాలుడి ఆద్, అతని తండ్రి నౌషాద్, సవతి తల్లి రజియాతో కలిసి ఉంటున్నాడు. శనివారం ఉదయం ఇంట్లో రూ.500 కనిపించకపోవడంతో తండ్రి తన కొడుకే ఈ డబ్బులు తీశాడనే అనుమానంతో బాలుడిని గొట్టపు పైపుతో తీవ్రంగా కొట్టాడు. అతని తలపై గట్టిగా కొట్టడంతో బాలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం బాలుడి తాతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు.. నిందితుడు, బాలుడి తండ్రి అయిన నౌషాద్, అతని భార్య రజియాను అరెస్ట్ చేశారు. బాలుడిని ప్రతిరోజు తండ్రి కొడుతుండే వాడని ఇంటి చుట్టుపక్కల వారు పోలీసులకు చెప్పారు. ఈ ఘటనపై ఘజియాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జ్ఞాన్ ప్రకాశ్ రాయ్ మాట్లాడుతూ, దంపతులను అదుపులోకి తీసుకున్నాం, తదుపరి విచారణ జరుపుతున్నామని తెలిపారు.