- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహా రైతు మార్చ్ నిలిపివేత.. ప్రభుత్వంతో చర్చలు సఫలం
ముంబై: మహారాష్ట్ర రైతుల మార్చ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయి. రైతులు, గిరిజనుల డిమాండ్లను తీర్చేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు రైతుల తరుపు బృందం పేర్కొంది. దీంతో రైతుల మార్చిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే నాలుగు రోజుల్లో ప్రభుత్వ హామీలో పురోగతి కనిపించకపోతే తిరిగి మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించారు.
‘మా డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. తాలూకా స్థాయిలో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని వారికి నాలుగు రోజుల అల్టిమేటం ఇచ్చాం. అప్పటి వరకు మా కవాతు వాసింద్‌లోని ముంబై సరిహద్దులో ఉంటుంది. మేము మా పాదయాత్రను ఆపేస్తాం. హామీ ప్రకారం డిమాండ్ల అమలును ప్రారంభించిన తర్వాతే మా గ్రామాలకు తిరిగి వస్తాము. లేకుంటే మా లాంగ్ మార్చ్‌ను కొనసాగించి ముంబైలోకి ప్రవేశిస్తాం' అని మార్చ్‌కి నాయకత్వం వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే జీవా గవిత్ అన్నారు. కాగా, ఈ సమావేశానికి సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మంత్రులు, రాష్ట్ర అధికారులు హాజరయ్యారు.