బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తుఫానుగా మారే అవకాశం

by Mahesh |   ( Updated:2024-05-23 11:31:53.0  )
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తుఫానుగా మారే అవకాశం
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపటికి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. అలాగే ఈ నెల 25న తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అంచనా ప్రకారం ఈ వాయుగుండం తుఫానుగా రూపాంతరం చెందితే దీనికి రెమాల్ గా నామకరణం చేశారు. కాగా మరో పక్క బెంగాల్ తీరంలో 26న తీవ్రమైన తుఫానుగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని కారణంగా తీర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్తారు వర్షాలు కురుస్తాయని.. ఇప్పటికే తమిళనాడు ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని ఏఎండీ స్పష్టం చేసింది.

Advertisement

Next Story