- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kejriwal: మరోసారి కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
దిశ, నేషనల్ బ్యూరో: ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆగస్టు 27 వరకు పొడిగించింది. తాజాగా జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్‌ను కోర్టు ముందు హాజరుపరిచారు. వాదనలు విన్న తర్వాత ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా కేజ్రీవాల్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే కేజ్రీవాల్‌కు ఈడీ దాఖలు చేసిన కేసులో జులైలో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికి సీబీఐ కేసులో ఇంకా బెయిల్ రాకపోవడంతో తీహార్ జైల్లోనే ఉన్నారు. ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ, కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై కోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ధర్మాసనం సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై స్పందించడానికి ఏజెన్సీకి ఆగస్టు 23 వరకు గడువు ఇచ్చింది.