- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
France: ఫ్రాన్స్ లోని రష్యా కాన్సులేట్ లోపల పేలుడు..!

దిశ, నేషనల్ బ్యూరో: ఫ్రాన్స్ లోని రష్యా కాన్సులేట్ లోపల పేలుడు జరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్లు పూర్తయిన వేళ ఈ ఘటన జరిగడం గమనార్హం. ఫ్రాన్స్ లోని మార్సే సిటీలో ఉన్న రష్యన్ కాన్సులేట్ బిల్డింగ్ లో ఈ బ్లాస్టింగ్ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి కాన్సులేట్ లోపల రెండు పెట్రో బాంబులను విసిరాడు. అందులో ఒకటి పేలగా.. మరొకటి పేలలేదని స్థానికులు వెల్లడించారు. ఘటనా స్థలం సమీపంలో దొంగిలించిన కారుని కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పేలుడు తర్వాత మున్సిపల్ పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. కాగా.. ఇది ఉగ్రదాడి అని.. ఫ్రెంచ్ అధికారుల నుండి సమగ్ర దర్యాప్తును డిమాండ్ చేసినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాబూల్‌లోని రష్యన్ రాయబార కార్యాలయంపై దాడి
మార్సేలో జరిగిన పేలుడు రెండేళ్ల క్రితం అఫ్గాన్ లోని రష్యన్ రాయాబర కార్యాలయంలో జరిగిన దాడిని పోలినట్లు ఉంది. అయితే, 2022 సెప్టెంబర్‌లో కాబూల్‌లోని రష్యన్ రాయబార కార్యాలయం ప్రవేశ ద్వారం సమీపంలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఆ ఘటనలో ఆరుగురు చనిపోయారు. ఆ దాడిలో ఇద్దరు రాయబార కార్యాలయ ఉద్యోగులు, మరో నలుగురు సాధారణ పౌరులు చనిపోయారు. దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఐసిస్ (ISIS) గ్రూప్ ప్రకటించింది. 2021 ఆగస్టులో తాలిబన్లు కాబూల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అక్కడి విదేశీ దౌత్య కార్యాలయంపై జరిగిన తొలి దాడి అదే.