I&B Ministry: ఆన్ లైన్ కంటెంట్ నియంత్రణకు కఠిన నిబంధనలు అవసరం

by Shamantha N |
I&B Ministry: ఆన్ లైన్ కంటెంట్ నియంత్రణకు కఠిన నిబంధనలు అవసరం
X

దిశ, నేషనల్ బ్యూరో: తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించి ప్రముఖ యూట్యూబర్‌ రణ్ వీర్‌ అల్హాబాదియా(Ranveer Allahbadia) వివాదాల్లో చిక్కుకున్నారు. కాగా..ఈ అంశాన్నే కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఆన్ లైన్ కంటెంట్ నియంత్రణకు కఠిన నిబంధనలు అవసరమని భావిస్తోంది. ఆ దిశగానే ప్రస్తుతం ఉన్న చట్టాల్లో సవరించాల్సిన అంశాలు ఏంటో పరిశీలిస్తోందని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ నిశికాంత్ దూబే అన్నారు. అశ్లీల, అభ్యంతరకర ఆన్‌లైన్‌ సమాచార నియంత్రణకు డిమాండ్లు పెరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అశ్లీలత, హింసాత్మక కంటెంట్‌ను ప్రదర్శించడానికి "భావ ప్రకటనా స్వేచ్ఛ" అనే రాజ్యాంగ హక్కును దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై సమాజంలో ఆందోళన పెరుగుతోందని చెప్పుకొచ్చారు.

అసలేం జరిగిందంటే?

‘ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌’(IGL) కార్యక్రమంలో యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించడంతో ప్రముఖ యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అల్హాబాదియాపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అతడి వ్యాఖ్యలపై పలువురు పార్లమెంటు సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సమయ్‌ రైనా షోలో అల్హాబాదియా ఈ వ్యాఖ్యలు చేశాడు. దాంతో అతడిపై పలు రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్ ను నియంత్రించేందుకు ఏం చర్యలు తీసుకున్నారి ఇటీవలే కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నిచింది. అలాగే ఇదే విషయంలో పార్లమెంటరీ ప్యానెల్ కూడా లేఖ రాసింది. దీనికే నిశికాంత్ దూబే సమాధానమిచ్చారు. ఇప్పటికే, ఐటీ రూల్స్- 2021లోని కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను ఓటీటీలు, సోషల్ మీడియాలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Next Story

Most Viewed