- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ గవర్నర్ తమిళికి సొంత కారు కూడా లేదు! ఎన్నికల అఫిడవిట్‌లో సంచలన విషయాలు
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తమిళనాడు లోక్‌సభ ఎన్నికల భరిలో ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్ధిగా ఆమె చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అయితే తమిళనాడులో తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తమిళిసై సౌందర్ రాజన్ నామినేషన్ ప్రత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. తన మొత్తం ఆస్తులు రూ. 2.17 కోట్లు, ప్రస్తుతం రూ. 50 వేల నగదు, రూ. కోటి 57 లక్షలపైగా చారస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. తన పేరిట సొంత కారు తనకు లేదని తెలిపారు. అలాగే తన భర్తకు రూ.3.92 కోట్ల చరాస్తులు, కుమార్తెకు రూ. కోటి విలువైన చరాస్తులు ఉన్నాయని, 4 కార్లు ఉన్నాయని తమిళిసై సౌంద్రరాజన్ వెల్లడించారు.
కాగా, తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి ఇటీవల ఆమె రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, తమిళనాడు స్టేట్ చీఫ్ అన్నమలై ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. కాగా, నిన్న ఒక్కరోజే తమిళనాడులో 400పైగా నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిసింది.