భారత్‌లో ఈవీఎం ఒక బ్లాక్ బాక్స్..కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

by vinod kumar |
భారత్‌లో ఈవీఎం ఒక బ్లాక్ బాక్స్..కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలు ముగిసి కొత్త కేంద్ర ప్రభుత్వం ఏర్పడినా ఈవీఎంలపై నెలకొన్న వివాదం మాత్రం ముగియడం లేదు. ఈవీఎంలపై ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ప్రకటన తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఈవీఎం బ్లాక్ బాక్స్ లాంటిదని అభివర్ణించారు. వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు. భారత ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి తీవ్రమైన ఆందోళనలు లేవనెత్తుతున్నాయని తెలిపారు. సంస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం బూటకంగా మారుతుందని. అంతేగాక మోసానికి గురవుతుందని చెప్పారు. ఈవీఎంలపై ఇప్పటికీ అనుమానంగానే ఉందని తెలిపారు.

కాగా, ఈవీఎంలకు రద్దు చేయాలని, ఇది మానవుడు లేదా ఏఐ ద్వారా హ్యాక్ చేయబడే ప్రమాదం ఉందని మస్క్ తెలిపారు. అంతకుముందు మస్క్ ప్రకటనపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ సైతం స్పందించారు. మస్క్ ప్రకటనలో ఏ మాత్రం నిజం లేదని చెప్పారు. ఇంటర్నెట్-కనెక్ట్ చేయబడిన ఓటింగ్ మెషీన్‌లను రూపొందించడానికి సాధారణ కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించే ఇతర ప్రదేశాలలో వర్తించవచ్చని చెప్పారు. భారతదేశంలో మాత్రం అలా జరగదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed