ఆ పుస్తకం అందరూ చదవాలి..ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సూచన!

by Jakkula Mamatha |   ( Updated:2024-05-17 14:36:15.0  )
ఆ పుస్తకం అందరూ చదవాలి..ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సూచన!
X

దిశ,వెబ్‌డెస్క్: భారత్‌లో ప్రతీ విద్యార్థి చదవాల్సిన ఓ పుస్తకాన్ని ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి పంచుకున్నారు. పాల్ జి.హెవిట్ రాసిన ‘కాన్సెప్చువల్ ఫిజిక్స్’ ను పుస్తకాన్ని ప్రస్తుతం తాను చదువుతున్నట్లు..దానిని ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు. దీన్ని రచయిత అద్భుతంగా రాశారని..అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీంట్లో అద్భుతమైన ఎక్సర్‌సైజులు ఉన్నాయని, క్లిష్టమైన ఐడియాలను చాలా చక్కగా వివరించారని తెలిపారు.

పుస్తకాలు చదవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇండియాన్ యూత్ గురించి ఇన్‌ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. నేటి యువకులు ఎంతో తెలివైనవారని, వీరి వయసులో తనకున్న తెలివి కంటే 10-20 రెట్లు ఎక్కువ టాలెంట్ కలిగి ఉన్నారని చెప్పారు. యువకులకున్న అడ్డంకులను తొలగించి, ఆకాశానికి చేరుకోవడానికి అవకాశాలను అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. AI పురోగతిలో భారతదేశం పాశ్చాత్య దేశాలను చేరుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read More..

ఆ రాష్ట్రాన్ని వణికిస్తున్న హెపటైటిస్ ఎ.. ఇప్పటికే 12 మంది మృతి.. దీనికి చికిత్స ఏంటి.. ?

Advertisement

Next Story