J&K LG on terror attacks: జమ్ముకశ్మీర్ ఉగ్రదాడులపై ఎల్జీ మనోజ్ సిన్హా వ్యాఖ్యలు

by Shamantha N |
J&K LG on terror attacks: జమ్ముకశ్మీర్ ఉగ్రదాడులపై ఎల్జీ మనోజ్ సిన్హా వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్ ఉగ్రదాడులపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని ఇచ్చారు. కశ్మీర్ లోయలో చిందించిన ప్రతి అమాయకుడి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు భద్రతా బలగాల సామర్థ్యాలన్నింటినీ ఉపయోగిస్తామని తెలిపారు. హమ్‌హమాలోని ఎస్‌టీసీలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) పాసింగ్ అవుట్-కమ్-అటెస్టేషన్ పరేడ్‌లో ఆయన ప్రసంగించారు. ఆ సందర్భంగానే పాకిస్థాన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌లో పాక్ నిరంతరం ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తోందన్నారు.

పాక్ పై విమర్శలు

మనోజ్ సిన్హా మాట్లాడుతూ.. “దురదృష్టవశాత్తు మన పొరుగున ఓ దేశం ఉంది. ఆ దేశంలో పేదరికం, ఆకలి ఉన్నప్పటికీ.. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ఆ దేశం నిరంతరం మద్దతు ఇస్తోంది” అని పాకిస్థాన్‌ను ఉద్దేశించి అన్నారు. ఇటీవల గందర్‌బల్, బారాముల్లాలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో జవాన్లు సహా పలువురు పౌరులు చనిపోయారు. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ.. భారతదేశపు మొదటి రక్షణ శ్రేణి అయిన బీఎస్‌ఎఫ్ తమ విధులను మరింత అప్రమత్తంగా నిర్వహించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed