- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
J&K's Poonch: పూంచ్ జిల్లాలో ఎదురుకాల్పులు
దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ హింసాత్మక పరిస్థితులు కొనసాగుతున్నాయి. పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతాబలాగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శనివారం సాయంత్రం పఠానాతీర్ ప్రాంతంలో పోలీసులు, ఆర్మీ సిబ్బంది సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్ సమయంలో దాక్కున్న అనుమానిత ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో, ఆ ప్రాంతంలో ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.
ఐదుగురు ముష్కరులు హతం
ఇకపోతే, శనివారం కిష్త్వార్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO)తో సహా ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఇకపోతే, కథువాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు, బారాముల్లాలో జరిగిన ప్రత్యేక ఆపరేషన్ లో ముగ్గురు ముష్కరులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.