రైల్వే స్టేషన్లలో ఆ భాష వచ్చే వారిని నియమించండి: డీఎంకే

by samatah |
రైల్వే స్టేషన్లలో ఆ భాష వచ్చే వారిని నియమించండి: డీఎంకే
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని రైల్వే స్టేషన్లలో తమిళం, ఇంగ్లీషులో మాట్లాడే ఉద్యోగులను నియమించాలని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎంపీ కనిమొళి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. రైల్వే సిబ్బందికి తమిళం రాకపోవడంతో రైల్వే స్టేషన్లలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. స్టేషన్లలో పనిచేసే ఉద్యోగులు హిందీలో మాట్లాడుతున్నారని, కానీ తమిళ ప్రజలకు హిందీ అర్థం కాకపోవడంతో సరైన సేవలు అందడం తెలిపారు. కాబట్టి తమిళ్, ఇంగ్లీషులో ప్రావీణ్యం ఉన్న ఉద్యోగులను నియమించాలని కోరారు. ఇటీవల జరిగిన ఓ ఘటనను మంత్రికి లేఖలో వివరించారు. ‘కోవిల్‌పట్టి రైల్వే స్టేషన్‌లో క్లర్క్‌కి తమిళం, ఇంగ్లీషు రాదు. దీంతో ప్రయాణికులు నింపిన రిజర్వేషన్ ఫామ్‌ను క్లర్క్ అర్థం చేసుకోలేదు. ఈ క్రమంలో వారి ఒక దానికి బదులుగా మరొక సీటులో రిజర్వేషన్ పొందారు’ అని తెలిపారు. ఈ విషయంపై స్టేషన్ మాస్టర్‌కి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో తమిళం లేదా ఇంగ్లీషు తెలిసిన వారిని నిమించాలని విజ్ఞప్తి చేశారు.

తక్షణ చర్యలు అవసరం!

తమిళనాడు రైల్వే ప్రయాణికులు చాలా రోజులుగా భాషా సంబంధిత సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇటీవల జరిగిన ఘటనే అందుకు ఉదాహరణ. ఈ క్రమంలో తమిళనాడు ప్రయాణీకుల భాషా అవసరాలను తీర్చడానికి రైల్వే అధికారులు వేగంగా స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఉద్యోగులకు భాషా పరమైన శిక్షణను అందించినా సమస్యను కాస్త పరిష్కరించుకోవచ్చని పలువురు సూచిస్తున్నారు. అంతేగాక ప్రస్తుత సాంకేతికతను ఉపయోగించుకుని, యాప్‌ల వంటివి ప్రవేశపెట్టినా భాషా అవరోధాలను తగ్గించొచ్చని చెబుతున్నారు. ద్వి భాషలు తెలిసిన వారిని ఇప్పటికిప్పుడు నియమించడం కష్టం కాబట్టి ఈ ప్రతిపాదనలను రైల్వే అధికారులు అమలు చేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed