అయోధ్యలో ఏమోషన్ సీన్.. ఉమాభారతి, సాధ్వి రితంభర కళ్లలో నీళ్లు

by Mahesh |
అయోధ్యలో ఏమోషన్ సీన్.. ఉమాభారతి, సాధ్వి రితంభర కళ్లలో నీళ్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అయోధ్యలో బాల రాముడు కొలువుదీరే అపురూప క్షణాలు ఆసన్నమయిన వేళ భక్తులు భావోద్వేగంతో పులకరించిపోతున్నారు. దశాబ్దాల కల కళ్లముందు సాక్షాత్కారం అవుతున్న తరుణంలో ఆయోధ్య నగరంలో ఎక్కడ చూసిన రామనామ జపమే వినిపిస్తోంది. ఇక ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు నగరానికి తరలి వస్తున్నారు. ఈ క్రమంలో అయోధ్యకు చేరుకున్న బీజేపీ నాయకురాలు ఉమాభారతి, సాధ్వి రితంభర పరస్పరం ఎదురుపడ్డారు.

బాల రాముడు కొలువుదీరుతున్న తరుణంలో వీరిద్దరు ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఈ సమయంలో వీరిద్దరు భావోద్వేగానికి లోనై కంట నీరు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం చేపట్టిన పోరాటంలో వీరిద్దరు కీలక పాత్ర పోషించారు.

Advertisement

Next Story

Most Viewed