'ఆలయ పాలన పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి..'

by Sumithra |
ఆలయ పాలన పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి..
X

దిశ, వేములవాడ : ఉత్తర కాశీతో సమానంగా అభివృద్ధి చెందాల్సిన వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధిలో వెనకబడుతుందని, ఆలయ అధికారులకు గల్ల పెట్టెల పై ఉన్న శ్రద్ధ, ఆసక్తి భక్తుల సౌకర్యాల కల్పన పై లేదని బీజేపీ వేములవాడ పట్టణ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆలయ ఆవరణలో స్థానిక బీజేపీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించి ఇచ్చే కోడెలను పేరు లేని గోశాలకు అప్పగించారని, సీఎం పర్యటన సందర్భంగా 32 వేలకు ప్లేట్ భోజనం పెట్టారని, ఇక్కడ వంటలు చేసేవారు లేరా..? వడ్డించే వారు లేరా అంటూ ప్రశ్నించారు.

ఆలయ ప్రాంగణంలోకి అన్యమతస్థులు వచ్చి మాంసాహార భోజనం పంపిణీ చేశారని, తాజాగా హుండీల్లో దొంగతనం జరిగి డబ్బులు ఎత్తుకువెళ్లారనే వార్త వచ్చిందని ఇలా నిత్యం ఏదో ఒక సంఘటన జరుగుతున్న ఆలయ అధికారులు లేఖలు విడుదల చేస్తున్నారనే తప్పితే చర్యలు తీసుకోవడం లేదని, భక్తులకు కావలసింది లేఖలు కాదని సీసీ కెమెరాల ఫుటేజీలని అన్నారు. ఇప్పటికైనా రాజన్న భక్తులతో పాటు రాష్ట్ర ప్రజలు ఆలయంలో జరుగుతున్న సంఘటనలు గమనించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రాజన్న ఆలయ అభివృద్ధి పై దృష్టి సారించి, ప్రస్తుత ఈవోను తొలగించి ఐఏఎస్ అధికారిని కేటాయించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed