Elon Musk: పేరు మార్చుకున్న ఎలన్ మస్క్.. కొత్త పేరు చూసి నెటిజన్ల షాక్

by vinod kumar |
Elon Musk: పేరు మార్చుకున్న ఎలన్ మస్క్.. కొత్త పేరు చూసి నెటిజన్ల షాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ (Elon musk) తన సొంత అభిప్రాయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి షాకింగ్ ప్రకటన చేశారు. మస్క్ తన పేరు మార్చుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఆయన పేరును కెకియస్ మాగ్జిమస్ అని రాసుకున్నారు. అలాగే ప్రొఫైల్ ఫొటోను కూడా చేంజ్ చేశారు. ప్రొఫైల్ పిక్చర్‌ను ‘పెపే ది ఫ్రాగ్’ ఊహాత్మక వర్షన్‌గా మార్చారు. ఇది చేతిలో వీడియో గేమ్ జాయ్‌స్టిక్‌ను పట్టుకుని, పెపేను యోధుడిగా చూపిస్తుంది. ఈ చిత్రం మస్క్ హాస్యభరితమైన ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే ఎలోన్ మస్క్ ప్రొఫైల్ పేరు, ఫోటోను మార్చినప్పటికీ, అతని ప్రొఫైల్‌కు చెందిన యూఆర్ఎల్ ఇప్పటికీ x.com/elon-musk గానే ఉంది. ఇటీవల పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించిన క్రిప్టోకరెన్సీ ‘కేకియస్ మాక్సిమస్’ మస్క్ ప్రకటనతో ప్రాధాన్యత సంతరించుకుంది. మస్క్ చేసిన ఈ చర్యతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. 2025 అద్బుతంగా ఉండబోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed