Gadkari : ఎలక్ట్రిక్ వాహన కంపెనీలకు ఇక సబ్సిడీలు అక్కర్లేదు : గడ్కరీ

by Hajipasha |
Gadkari : ఎలక్ట్రిక్ వాహన కంపెనీలకు ఇక సబ్సిడీలు అక్కర్లేదు : గడ్కరీ
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలకు ఇక ప్రభుత్వ రాయితీలు అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రస్తుతం వినియోగదారులంతా స్వచ్ఛందంగా వాళ్లంతట వాళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్‌జీ వాహనాలను కొంటున్నారని గడ్కరీ తెలిపారు. ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రక్రియ మొదలైన తొలినాళ్లలో ఉత్పత్తి ఖర్చు చాలా ఎక్కువగా ఉండేది. అప్పట్లో వాటికి డిమాండ్ తక్కువగా ఉండేది. అందుకే సబ్సిడీ ఇచ్చాం. ఇప్పుడు ఈవీలు, సీఎన్‌జీ వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఉత్పత్తి ఖర్చులు తగ్గిపోయాయి. అందుకే ఇక సబ్సిడీలు అక్కర్లేదు’’ అని కేంద్ర మంత్రి గడ్కరీ వివరించారు. పెట్రోలు, డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ తక్కువగానే ఉందన్నారు. ఇక ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు సబ్సిడీలను అడగడం కూడా కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story