బాలయ్య అన్ స్టాపబుల్ షోకు హీరో సూర్య

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-24 11:11:57.0  )
బాలయ్య అన్ స్టాపబుల్ షోకు హీరో సూర్య
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ హోస్టుగా ఓటీటీ ఆహాలో అన్ స్టాపబుల్ పేరుతో నిర్వహిస్తున్న టాక్ షో కు తమిళ స్టార్ హీరో సూర్య హాజరయ్యారు. బాలయ్య అన్‌ స్టాపబుల్‌ సీజన్‌4తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక సీజన్ 4కు మొదటి గెస్ట్ గా ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఈ తొలి ఎపిసోడ్ ఈనెల 25న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. కంగువా సినిమా ప్రమోషన్ నేపథ్యంలో ఇప్పుడు ఈ టాక్ షోకు స్టార్ హీరో సూర్య కూడా హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో జరుగనున్న షూటింగ్ పార్టులో ఆయన పాల్గొనబోతున్నారు. సూర్యతో పాటు బాలీవుడ్ నటుడు విలన్ బాబీ డియోల్ కూడా బాలయ్య షోకు హాజరు కానున్నాడు.

సూర్య నటించిన పాన్ ఇండియా మూవీ కంగువా వచ్చేనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. కంగువ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక బాలయ్య షోలో సూర్య, బాబీ డియోలు ఎలా సందడి చేస్తారో చూడాలి. బాలయ్య లాంటి లెజెండ్ స్టార్ హీరోతో మరోక స్టార్ హీరో సూర్య ఇంటర్వ్యూ కావడంతో ఇందులో ఎన్నెన్ని ఆసక్తికర విషయాలు బయట పడతాయో అంటూ వాటి కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed