Bomb threats: ఒక్కరోజే 70 విమనాలకు బెదిరింపులు

by Shamantha N |
Bomb threats: ఒక్కరోజే 70 విమనాలకు బెదిరింపులు
X

దిశ, నేషనల్ బ్యూరో: విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. ఒక్కరోజే 70కి పైగా విమానాలకు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఎయిరిండియా, విస్తారా, ఆకాశ ఎయిర్, ఇండిగో వంటి దేశీయ విమానసంస్థలకు గురువారం బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఎయిరిండియా, విస్తారా, ఇండిగో సంస్థలకు చెందిన 20 చొప్పున విమానాలకు బెదిరింపులు వచ్చాయి. అలానే, ఆకాశ ఎయిర్ కు చెందిన 14 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆకాశ ఎయిర్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. అక్టోబర్ 24న తమ సంస్థకు చెందిన కొన్ని విమానాలకు భద్రతాపరమైన హెచ్చరికలు వచ్చినట్లు తెలిపారు. ‘‘మా అత్యవసర ప్రతిస్పందన బృందాలు వాటిని పరిశీలిస్తున్నాయి. భద్రత, నియంత్రణ సంస్థల అధికారులతో టచ్‌లో ఉన్నాం. భద్రతాపరమైన నియమావళిని పాటిస్తున్నాం’’ అని తెలిపారు.

ఇప్పటికే 250 ఫ్లైట్లకు బెదిరింపులు

మొత్తంగా 11 రోజుల వ్యవధిలో 250 ఫ్లైట్లకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఇప్పటికే, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు బూటకపు బెదిరింపులపై స్పందించారు. దీనికోసం చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. అలాంటి బెదిరింపులకు పాల్పడేవారిని నో-ఫ్లై లిస్ట్‌లో ఉంచుతామని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed