- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల బాండ్ల చిట్టా విప్పిన ఈసీ.. టాప్‌లో బీజేపీ, 4th ప్లేస్‌లో బీఆర్ఎస్
దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం తు.చ తప్పకుండా అమలు చేసింది. ఎస్‌బీఐ అందించిన ఎలక్టోరల్ బాండ్ల చిట్టాను గురువారం సాయంత్రం విప్పింది.763 పేజీలతో కూడిన ఎలక్టోరల్ బాండ్ల డొనేషన్ వివరాలను అధికారిక వెబ్‌సైట్ eci.gov.in వేదికగా ఈసీ విడుదల చేసింది. దీని పరంగా ఏయే రాజకీయ పార్టీలకు ఎన్ని డొనేషన్స్ వచ్చాయి ? వాటిని ఇచ్చిన వారెవరు? అనే కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల బాండ్ల సమాచారాన్ని లింకు ద్వారా తెలుసుకోవచ్చని ఈసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. పార్ట్-1లో ఎన్నికల బాండ్లు కొన్నవారి వివరాలు.. పార్ట్-2లో బాండ్లను ఎన్‌క్యాష్ చేసుకున్న పార్టీల వివరాలు పేర్కొన్నది. ఈ వివరాల వెల్లడిలో పారదర్శకంగా ఉన్నామని ఈసీ స్పష్టం చేసింది. ఎస్‌బీఐ ఇచ్చిన సమాచారాన్ని యథాతధంగా తమ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టామని తెలిపింది.
పార్టీలవారీగా విరాళాల లెక్క..
ఈ జాబితా ప్రకారం..యావత్ భారత్‌లోని రాజకీయ పార్టీలకు 2019 ఏప్రిల్ నుంచి 2024 జనవరి మధ్యకాలంలో ఎలక్టోరల్ బాండ్ల జారీ ద్వారా రూ.12,155 కోట్ల విరాళాలు అందాయి. దేశంలోనే హైయెస్ట్ డొనెషన్స్ పొందిన రాజకీయ పార్టీగా బీజేపీ నిలిచింది. ఆ పార్టీకి రూ.6,061 కోట్ల విరాళాలు బాండ్ల ద్వారా అందాయి. ఇక రెండో స్థానంలో ఉన్న టీఎంసీకి రూ.1,610 కోట్లు, మూడో ప్లేస్‌లో ఉన్న కాంగ్రెస్‌కు రూ.1,422 కోట్లు, నాలుగో ప్లేసులో ఉన్న బీఆర్ఎస్‌కు రూ.1,300 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత బిజూ జనతాదళ్‌కు రూ.776 కోట్లు, డీఎంకే పార్టీకి రూ.639 కోట్లు, వైసీపీకి రూ.337 కోట్లు, టీడీపీకి రూ.219 కోట్లు, జనసేనకు రూ.21 కోట్లు, ఉద్ధవ్ శివసేనకు రూ.158 కోట్లు, ఆర్జేడీకి రూ.73 కోట్లు, ఆమ్ ఆద్మీకి రూ.65 కోట్లు విరాళంగా అందాయి.
ఏ పార్టీకి ఎన్ని బాండ్లు?
ఇక, 2018 నుంచి ఇప్పటివరకు బీజేపీకి అత్యధికంగా 8,633, టీఎంసీకి 3,305, కాంగ్రెస్‌కు 3,146, ఆప్‌కు 245, డీఎంకేకు 648 బాండ్ల జారీ ద్వారా డొనేషన్స్ వచ్చాయి. తెలంగాణకు చెందిన బీఆర్ఎస్‌కు 1,806, వైసీపీకి 472, టీడీపీకి 279, జనసేనకు 39 ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందాయి.
టాప్ -10 దాతలు ఎవరంటే?
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 2019 నుంచి 2024 వరకు రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో సగానికి సగం కేవలం 23 కంపెనీల నుంచే అందాయి. భారీ విరాళం ఇచ్చిన దాతగా శాంటియాగో మార్టిన్ నిలిచింది. లాటరీ కింగ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఈయన రూ.2,455.20 కోట్లను విరాళంగా ఇచ్చాడు. దేశంలో లాటరీ సేల్స్ లీగల్‌గా జరుగుతున్న 13 రాష్ట్రాల్లో మార్టిన్ బిజినెస్ చేస్తూ నిత్యం కోట్లు ఆర్జిస్తున్నాడు. 2023లో మేలో ఈడీ తమిళనాడులోని శాంటియాగో మార్టిన్ వ్యాపారాలపై రైడ్స్ చేసింది. అప్పుడు రూ.457 కోట్లు విలువైన ఆస్తులను ఈడీ ఫ్రీజ్ చేసింది.
లిస్టులో లేని టాటా, అదానీ, రిలయెన్స్..
దేశంలోనే బడా కంపెనీలైన టాటా, అదానీ, రిలయెన్స్ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లకు దూరంగా ఉన్నాయి. ఈ మూడు దిగ్గజ కంపెనీలు బాండ్ల లిస్టులో తప్పక ఉంటాయని అంతా భావించారు. కేంద్రం అదానీ కంపెనీకి గతంలో ప్రభుత్వ ప్రాజెక్టులను పెద్దఎత్తున కట్టబెట్టడంతో ఆ మధ్య మోడీ, అదానీ మిత్రులని వీరిద్దరి మధ్య చీకటి లావాదేవీలు జరిగినట్లు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా, వాస్తవానికి భిన్నంగా ఈసీ విడుదల చేసిన సమాచారాన్ని బట్టి ఈ విషయం తేటతెల్లమైంది.
రెండో పేరు మన హైదరాబాద్ కంపెనీదే..
అత్యధిక విరాళం ఇచ్చిన కంపెనీల లిస్టులో రెండో పేరు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాదే. ఈ కంపెనీ రూ.2318 కోట్లు డొనేషన్ ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల దాతలు వీరే..
రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు ద్వారా విరాళాలను అందించిన దాతల లిస్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా కంపెనీలే ఉన్నాయి. పీవీ క్రిష్ణారెడ్డికి చెందిన మేఘా ఇంజినీరింగ్ కంపెనీ, వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ, మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పి.ఆర్.రెడ్డి ఈ కంపెనీ బోర్డులో డైరెక్టర్‌గా ఉండటం గమనార్హం. తెలంగాణ పారిశ్రామిక దిగ్గజం జూపల్లి రామేశ్వర్ రావుకు చెందిన మై హోం ఇన్‌ఫ్రా దాతల లిస్టులో ఉంది. హైదరాబాద్‌లో ప్రఖ్యాతి గడించిన అపర్ణ ఫామ్స్ అండ్ ఎస్టేట్స్, ఫార్మాకు చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, ఫార్మా దిగ్గజం సత్యనారాయణరెడ్డికి చెందిన ‘ఎంఎస్ఎన్ ఫార్మా కెమ్’, ఎంఎస్ఎన్ లేబొరేటరీస్ దాతల లిస్టులో ఉన్నాయి. వెంకయ్యచౌదరి నన్నపనేనికి చెందిన నాట్కో ఫార్మా, హైదరాబాద్ కేంద్రంగా వ్యాక్సిన్లు తయారు చేసే భారత్ బయోటెక్ లిమిటెడ్, తెలంగాణ, ఏపీ కేంద్రంగా పనిచేసే వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ వల్లూరుపల్లి ప్రభుకిశోర్ దాతల జాబితాలో ఉన్నారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కంపెనీ ప్రమోటర్లు విశ్వేశ్వర రెడ్డి, కె.రవికుమార్ రెడ్డిలకు ఏపీ సీఎం జగన్‌కు సన్నిహితులుగా పేరుంది. ఈ కంపెనీ కూడా విరాళాలు ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే శ్రీ సిద్ధార్థ్ ఇన్ ఫ్రా టెక్ అండ్ సర్వీసెస్ దాతల లిస్టులో ఉంది. పొనుగోటి హేమేందర్ రావు అనే ఓ తెలుగు దాత పేరు ఈసీ విడుదల చేసిన జాబితాలో ఉంది.
కంపెనీలు అందించిన విరాళాలు
ఎంత మొత్తం - ఎన్ని సార్లు
రూ.1 కోటి - 11,671
రూ.10 లక్షలు - 4,620
రూ.1 లక్ష - 2,228
రూ.10వేలు - 220
రూ.1 వెయ్యి - 132
రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలు
ఎంత మొత్తం - ఎన్నిసార్లు
రూ.1 కోటి - 12,207
రూ.10 లక్షలు - 5,366
రూ.1 లక్ష - 2,526
రూ.10వేలు - 219
రూ.1,000 - 103
ఒకరోజు ముందే విడుదల..
ఎలక్టోరల్ బాండ్ల విరాళాల సమాచారాన్ని మంగళవారం (మార్చి 12న) సాయంత్రంలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఎస్‌బీఐను సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. మార్చి 15న సాయంత్రంలోగా ఈ వివరాలను వెబ్‌సైట్ ద్వారా దేశ ప్రజలకు బహిర్గతం చేయాలని ఈసీకి ఆనాడే దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్దేశం చేసింది. అయితే సుప్రీంకోర్టు సూచించిన తేదీ కంటే ఒకరోజు ముందే (గురువారం) ఆ ఆదేశాలు కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేసింది.