- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల బాండ్ల సెకండ్ లిస్ట్.. ఏ పార్టీకి ఎన్ని విరాళాలు ?
దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల బాండ్ల స్కీం 2018 సంవత్సరం నుంచే మన దేశంలో అమల్లోకి వచ్చింది. అయితే ఇటీవల విడుదల చేసిన ఎన్నికల బాండ్ల సమాచారంలో 2019 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి మధ్య కాలానికి సంబంధించిన సమాచారం మాత్రమే ఉంది. 2018 జనవరి నుంచి 2019 ఏప్రిల్ మధ్యకాలానికి సంబంధించిన ఎన్నికల బాండ్ల సమాచారాన్ని తాజాగా ఆదివారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ వేదికగా విడుదల చేసింది. దాని ప్రకారం.. 2018 జనవరి నుంచి 2019 ఏప్రిల్ మధ్యకాలంలో ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి దేశంలోనే అత్యధికంగా రూ.1660 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇవి కూడా కలుపుకుంటే 2018 నుంచి ఈ ఏడాది వరకు బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాల అమౌంట్ రూ.7,720 కోట్లకు పెరిగింది. వీటిలో రూ.2,555 కోట్లను కేవలం 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే కాషాయ పార్టీ పొందడం గమనార్హం.
ప్రాంతీయ పార్టీల హవా..
ఆశ్చర్యకరంగా 2018 జనవరి నుంచి 2019 ఏప్రిల్ మధ్యకాలంలో ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు పొందే విషయంలో ప్రాంతీయ పార్టీలు సూపర్ స్పీడుతో దూసుకెళ్లాయి. ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ పార్టీ ఏకంగా రూ.244 కోట్ల విరాళాలు సాధించింది. దాని తర్వాతి స్థానాల్లో బీఆర్ఎస్ (రూ.230 కోట్లు), వైఎస్సార్ సీపీ (రూ.174 కోట్లు), టీడీపీ (రూ.109 కోట్లు), శివసేన - ఉద్ధవ్ (రూ.83 కోట్లు), తృణమూల్ కాంగ్రెస్ (రూ.74 కోట్లు), కాంగ్రెస్ (రూ.35 కోట్లు), శరద్ పవార్ - నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (రూ.37 కోట్లు),జేడీ(ఎస్) (రూ.25 కోట్లు), జేడీయూ (రూ.13 కోట్లు), సమాజ్ వాదీ (రూ.10 కోట్లు), శిరోమణి అకాలీదళ్ (రూ.6.76 కోట్లు), అన్నా డీఎంకే (రూ.6 కోట్లు), ఆమ్ ఆద్మీ పార్టీ (రూ.5.75 కోట్లు), ఆర్జేడీ (రూ.2.50 కోట్లు) నిలిచాయి.
2018 నుంచి 2024 వరకు..
2018 నుంచి 2024 వరకు రాజకీయ పార్టీలు పొందిన మొత్తం విరాళాల లెక్కను చూస్తే.. తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి మొత్తం రూ. 656.5 కోట్ల విరాళాలు ఎన్నికల బాండ్ల ద్వారా రాగా.. వాటిలో రూ.509 కోట్లు లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ నుంచే వచ్చాయి. బీజేపీ తర్వాత ఎక్కువగా విరాళాలు పొందిన పార్టీల లిస్టులో రెండో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ఉంది. దీనికి మొత్తం రూ.1,397 కోట్ల విరాళాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి మొత్తం రూ.1,334 కోట్లు, బీఆర్ఎస్ పార్టీకి రూ.1322 కోట్లు, బిజు జనతాదళ్ పార్టీకి రూ.944 కోట్లు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రూ.442.8 కోట్లు, టీడీపీకి రూ.181.35 కోట్లు, సమాజ్‌వాదీ పార్టీకి రూ.14.5 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎన్నికల బాండ్ల జారీ ద్వారా అందాయి.
ఈ లిస్టు ఎందుకు ఆలస్యమైంది ?
ఎన్నికల బాండ్ల మరో జాబితాను ఆదివారం విడుదల చేయడం వెనుక ఒక కారణం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2019 సంవత్సరంలో రాజకీయ పార్టీలన్నీ అప్పటివరకు(రెండేళ్లలో) తాము ఎన్నికల బాండ్ల ద్వారా పొందిన విరాళాల సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాయి. ఈ వివరాలన్నీ కలిపి ఒక సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే సమర్పించింది. నాటి నుంచి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వద్దే ఆ సమాచారం భద్రంగా ఉంది. తాజాగా మార్చి 11న ఎన్నికల బాండ్ల సమాచారాన్ని విడుదల చేయాలంటూ ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే 2018 -2019 ఎన్నికల బాండ్ల సమాచారాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుంచి తమకు తిరిగి అందజేస్తే ప్రజలకు బహిర్గతపరుస్తామంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఎన్నికల సంఘం కోరింది. దీంతో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ శనివారం సాయంత్రమే ఆనాటి ఎన్నికల బాండ్లతో కూడిన సీల్డ్ కవర్‌ను తిరిగి ఈసీకి అందించింది. తాజాగా ఆదివారం మధ్యాహ్నం ఆ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.