కొనసాగుతున్న కర్ణాటక ఎన్నికలు.. 224 నియోజకవర్గాల్లో పోలింగ్

by samatah |   ( Updated:2023-05-10 06:09:08.0  )
కొనసాగుతున్న కర్ణాటక ఎన్నికలు.. 224 నియోజకవర్గాల్లో పోలింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 224 నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అత్యంత పటిష్టమైన పోలీసుల బందోబస్తు మధ్య పోలింగ్ జరుగుతోంది. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌తో పాటు సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, రాష్ట్ర హోంమంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, నటులు ప్రకాశ్ రాజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 వరకు జరగనుంది. ఈ ఉదయం 9 వరకు 8.26 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

కాగా ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూతులకు వెళ్లి ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగ జరుపుకోవాలని ప్రధాని మోదీ, అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి కార్జున్ ఖర్గే తదితరులు ఓటర్లకు పిలుపునిచ్చారు. కాగా కర్ణాటకలో 1985 నుంచి కూడా ఏ పార్టీ కూడా వరుసలో రెండోసారి అధికారంలోకి రాలేదు. గత ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి ఆ తర్వాత అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు కూడా సత్తా చాటి మరోసారి సైతం అధికార పీఠాన్ని దక్కించుకోవాలనే ఆలోచనలో ఉంది. అటు కాంగ్రెస్ సైతం గెలుపీ ధీమాతో ఉంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటా అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.

Read More: ఓటు హక్కు వినియోగించుకున్న నారాయణమూర్తి దంపతులు

ఇవే నా చివరి ఎన్నికలు.. మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన

Advertisement

Next Story