Election Results-2024: ఉత్కంఠభరితంగా జమ్ముకశ్మీర్‌ కౌంటింగ్ ప్రక్రియ.. రెండు చోట్ల ఆధిక్యంలో ఒమర్ అబ్దుల్లా

by Shiva |   ( Updated:2024-10-08 03:53:45.0  )
Election Results-2024: ఉత్కంఠభరితంగా జమ్ముకశ్మీర్‌ కౌంటింగ్ ప్రక్రియ.. రెండు చోట్ల ఆధిక్యంలో ఒమర్ అబ్దుల్లా
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకశ్మీర్‌ (Jammu & Kashmir) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 90 స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్‌‌ను ప్రక్రియను‌ నిర్వహించగా.. 63.45 శాతం పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా ఆర్టికల్-370 (Article-370) రద్దు తరువాత జరిగే మొట్టమొదటి ఎన్నికలు కావడంతో వెలువడే ఫలితాలపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress), ఎన్‌సీ (Jammu and Kashmir National Conference) పార్టీలు కలిసి పోటీ చేశాయి. మరోవైపు బీజేపీ, పీడీపీ సింగిల్‌గానే ఎన్నికల బరిలోకి దిగాయి. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌ (Jammu & Kashmir)లో 77 స్థానాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. కాంగ్రెస్ 46 స్థానాల్లో, బీజేపీ 25 చోట్ల, ఇతరులు 6 చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా తాను పోటీ చేసిన గందర్ బాల్, బుద్గాం స్థానాల్లో లీడ్‌లో కొనసాతున్నారు.

Advertisement

Next Story